చిత్రం: గోరింటాకు (1979)
నటీనటులు : శోభన్ బాబు , సుజాత
సాహిత్యం:వేటూరి సుందర రామమూర్తి
గానం : ఎస్ పి బాలు ,సుశీల
సంగీతం : కె వి మహదేవన్
కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటి మౌనం ఎందుకీ ధ్యానం
ఏమిటి మౌనం ఎందుకీ ధ్యానం
కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి
మనసులో ధ్యానం మాటలో మౌనం
మనసులో ధ్యానం మాటలో మౌనం
చరణం -1:
మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
మనసు మాటకందని నాడు మధురమైన పాటవుతుంది
మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది
పల్లవించు పడచుదనం పరుచుకున్న మమతను చూడు
పల్లవించు పడచుదనం పరుచుకున్న మమతను చూడు
పసితనాల తొలి వేకువలో ముసురుకున్న మబ్బును చూడు
అందుకే ధ్యానం అందుకే మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి
చరణం-2:
కొంటె వయసు కోరికలాగా గోదారి ఉరుకులు చూడు
ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
కొంటె వయసు కోరికలాగా గోదారి ఉరుకులు చూడు
ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడి పడి ఉండాలి
ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడి పడి ఉండాలి
ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి
అందుకే ధ్యానం అందుకే మౌనం
కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి
ఏమిటి మౌనం ఎందుకీ ధ్యానం
మనసులో ధ్యానం మాటలో మౌనం